ప్రేమించిన యువతి తన దగ్గర లేదని సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

ప్రేమించిన యువతి తన దగ్గర లేదని సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

0
102

హైదరాబాద్ లో దారుణం జరిగింది… ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువతి తనను విడిచి పెట్టివెళ్లిందనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. చంద్రకిరణ్ అనే వ్యక్తి మాధాపూర్ లోని ఇక సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు…

అతనికి ఒక యువతి పరిచయం అయింది… ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది… దీంతో వీరిద్దరు బేగంపేటలో సహజీవనం చేశారు… కొన్నిరోజులకు కేబీహెచ్ పీ కాలనీలో ఒక అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు… ఇంతలో ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ యువతి చంద్రకిరణ్ ను వదిలి వెళ్లి పోయింది..

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి లేదని మనస్తాపానికి చెందని చంద్రకిరణ్ తాన ఉంటున్న అపార్ట్ మెంట్ లోనే సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ క్రమంలో తన సోదరుడు ఫోన్ చేశాడు… ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానంతో సోదరుడు అపార్ట్ మెంట్ కు వచ్చి చూస్తే ఫ్యాన్ కు వేలాడుతున్నాడు చంద్రకిరణ్… దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు… కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..