ప్రేమ వివాహం చేసుకున్న ఐదు రోజులకే ఫ్యానుకు వేలాడుతున్న నవవధువు

ప్రేమ వివాహం చేసుకున్న ఐదు రోజులకే ఫ్యానుకు వేలాడుతున్న నవవధువు

0
82

వివాహం అయిన ఐదు రోజులకే నవవధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిరువూర్ జిల్లాలో జరిగింది… ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… మారుతీ నగర్ కు చెందిన రాజ్ కుమార్తె దేవి అమరావతికి చెందిన సమీప బంధువు సెల్వరాజ్ తో ఇటీవలే పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు..

ఉదయం దంపతులిద్దరూ దేవి ఇంటికి విందు భోజనానికి వెళ్లారు. మధ్యాహ్నం ఇంటివెలుపల సెల్వరాజ్ బంధువులతో మాట్లాడుతున్నాడు.. ఇంట్లోకి వెళ్లిన దేవి హఠాత్తుగా తలుపులు వేసుకుంది… సమయం గడుస్తున్నా బయటకు రాకపోవడంతో తలపులు తట్టారు…

స్పందన లేకపోవడంతో తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇంటి దూలానికి దేవి చీరతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది.. దీంతో ఆమెను హూటా హుటీన ఆసుపత్రికి తరలించారు… పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…