ప్రియుడిని కత్తిలో పొడిచి చంపిన ప్రియురాలు… కారణం తెలిస్తే షాక్ అవుతారు..

ప్రియుడిని కత్తిలో పొడిచి చంపిన ప్రియురాలు... కారణం తెలిస్తే షాక్ అవుతారు..

0
83

ఈ దారుణం కృష్ణా జిల్లాలో జరిగింది… ప్రియుడు పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడనే కారణంతో ప్రియురాలు కత్తితో దాడి చేసింది… ఆ తర్వాత ఆమె కూడా నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. మచిలీపట్నంకు చెందిన ఒక యువతి స్థానిక కాలేజిలో పని చేస్తుంది… పెడన తహసీల్దార్ కార్యాలయంలో కప్యూటర్ ఆపరేటర్ గా యువకుడు పని చేస్తున్నారు..

వీరిద్దరికి రెండేళ్లుగా పరిచయం ఉండటంతో స్థానికంగా ఒక గదిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు.. ఈక్రమంలో నిన్న సాయంత్రం వీరిద్దరు గదిలో అపస్మారక స్థితిలో పడిఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.. దీంతో పోలీసులు వీరిద్దరిని వేరు వేరు ఆసుపత్రులకు తరలించారు…

యువకుడు తెలిపిన వివరాల ప్రకారం కొద్దికాలంగా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తోందని పెళ్లి చేసుకుని కలిసి బదుకుదామని లేదంటే కలిసి చనిపోదావని చెబుతూ కత్తితో దాడిచేసిందని చెప్పాడు.. ప్రస్తుతం యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…