ప్రియుడితో పారిపోయిన భార్య – భర్తని అరెస్ట్ చేసిన పోలీసులు కారణం వింటే షాక్

ప్రియుడితో పారిపోయిన భార్య - భర్తని అరెస్ట్ చేసిన పోలీసులు కారణం వింటే షాక్

0
84

పాపం పెళ్లి చేసుకున్న ఆనందం అంతనికి లేకుండా చేసింది అతని భార్య, ఒడిశాలో ఓ యువకుడికి అదే ప్రాంతానికి చెందిన యువతితో 2013లో పెళ్లయింది. రెండు నెలల తర్వాత అతని భార్య కనిపించకుండా పోయింది. దీంతో కట్నం కోసం మా అల్లుడే అమ్మాయిని చంపేశాడు అని శవం దొరక్కుండా చేశాడు అని అతనిపై అమ్మాయి తరపు వారు కేసు పెట్టారు.

దీంతో పోలీసులు అతన్ని అనుమానించి కేసు పెట్టారు….చివరకు అతనిని అరెస్ట్ చేసి జైలుకి పంపారు, ఏ పాపం చేయలేదు అని చెప్పినా అతని మాట ఎవరూ వినలేదు.. చివరకు అతను నెల రోజులో జైలు శిక్ష అనుభవించి బెయిల్ పై వచ్చాడు, తప్పు చేయని నన్ను ఇలా నిందించారు అని కన్నీరు మున్నీరు అయ్యాడు.

ఇక భార్య ఏమైందా అని వెతకడం ప్రారంభించాడు, చివరకు ఏడు సంవత్సరాల తర్వాత తన భార్య ఆచూకి తెలిసింది,
మహరాణా అనే వ్యక్తితో సహజీవనం చేస్తోందని గుర్తించాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు, అతను తన లవర్ అని అతనితో పారిపోయి బతుకుతోంది అని పోలీసుకు వివరించాడు,. అయితే తల్లిదండ్రులు కూడా ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయారు, పాపం అతను ఏడు ఏళ్లు నరకం అనుభవించాడు ఈదారుణంతో.