మద్యంగా శానిటైజర్ తాగితే ఏమవుతుంది, డాక్టర్ల హెచ్చరిక

మద్యంగా శానిటైజర్ తాగితే ఏమవుతుంది, డాక్టర్ల హెచ్చరిక

0
145

మద్యం దొరక్క కొందరు శానిటైజర్లు కూడా తాగుతున్నారు, మరికొన్ని చోట్ల మద్యం ధరలు పెరిగిపోయాయి దీంతో శానిటైజర్లు తీసుకోవడం సోడా డ్రింక్ కలుపుకుని తాగడం చేస్తున్నారు, ఇది ప్రాణాలకే చేటు చేస్తుంది.

ఎందుకు ఇలా తాగుతున్నారు అంటే ఆ శానిటైజర్లలో ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి… అది తమకు కిక్ ఇస్తుందని అంటున్నారు.. పైగా శానిటైజర్ నుంచి వచ్చే వాసన మత్తుగా గమ్మత్తుగా ఉంటోందంటున్నారు మందుబాబులు.

ఈ శానిటైజర్లు కరోనా వైరస్ రాకుండా జాగ్రత్తగా ఉండటానికి, అయితే ఈ మందుబాబులు దీనిని సోడాలో డ్రింక్ లో దీనిని కలుపుకుని తాగుతున్నారు, దీని వల్ల చాలా ప్రమాదం అంటున్నారు వైద్యులు, రక్తంలో కలిసి గుండెకి చేరుతుంది, అలాగే పేగులు కుళ్లిపోతాయి, కోమాలోకి వెళ్లి ఏకంగా ప్రాణాలు కోల్పోతారు అంటున్నారు వైద్యులు.