మహతి కళాక్షేత్రంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

0
108

కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సమ సమాజం కోసం పోరాడిన, బహుజన తత్వవేత్త సామజిక దార్శనికుడు మహాత్మ జ్యోతిబా పూలే 195వ జయంతి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్బంగా పూలే అందించిన సేవలను మనమంతా ఒకసారి స్మరించుకోవాలి. వర్ణ వివక్షతను రూపుమాపడం కోసం, దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కష్టపడ్డారు. అంతేకాకుండా కుల వృత్తులకు సామజిక గౌరవాన్ని పెంపొందించేందుకు అనేక కారక్రమాలు చేపట్టారు.

జ్యోతిబా పూలే జయంతి వేడుకలు తిరుమల తిరుపతి దేవస్థానం ఏప్రిల్‌ 11వ తేదీ తిరుపతి మహతి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించనుంది. మహతి కళాక్షేత్రంలో ఉదయం 11 గంటలకు జయంతి సభ ప్రారంభం కానుంది. టిటిడి ఆధ్వర్యంలో జరుగనున్న ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల అధిపతులు, ఉద్యోగులు పాల్గొననున్నారు.