నిర్భయ నింధితుల ఉరి వాయిదా పడటంతో దేశం మొత్తం విమర్శలు వెలువెత్తుతున్నాయి. చట్టంలోని లోపాలను వాడుకుని నింధిలు దేశంలో యథేచ్చగా బతుకుతున్నారని జనం విమర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సంచనమైన వ్యాఖ్యలు చేశాడు.
అప్పడు మానవ మృగాల చేతిలో గ్యాంగ్ రేప్‌కు గురైన నిర్భయ.. ప్రస్తుతం మన దేశ న్యాయ వ్యవస్థ చేతిలో మరో సారి సామూహిక అత్యాచారానికి గురైందని రామ్‌గోపాల్ ట్విట్ చేశారు. ఏ విషయంలో అయినా కాంట్రవర్శీ వ్యాఖ్యలు చేసే రామ్‌గోపాల్ ఈ సారి ఎమోషనల్‌గా ట్విట్ చేయడం విషేషం.
మృగాలు యథేచ్చగా గ్యాంగ్ రేప్ చేసుకోవచ్చు కానీ.. అంతే యథేచ్చగా వారికి శిక్ష వేయడానికి వీలు లేకుండా మన న్యాయ వ్యవస్థ ఉందని మండి మండిపడ్డారు. వీరికి శిక్ష వేయడానికి మన కోర్టులు ఎన్ని అవస్థలు పడుతున్నాయో చూడండి మోడీగారు అంటూ ట్విట్ చేశారు.