మ‌న దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కూ ఎంత‌మందికి ఉరిశిక్ష ప‌డింది?

మ‌న దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కూ ఎంత‌మందికి ఉరిశిక్ష ప‌డింది?

0
97

మ‌న దేశంలో ఉరి శిక్ష అన్ని శిక్ష‌ల కంటే దారుణ‌మైన శిక్ష గా చెబుతారు.. మ‌నిషి ప్రాణాలు పోతాయి కాబ‌ట్టి క‌ఠిన శిక్ష‌గానే చెబుతారు, అయితే తాజాగా నిర్భ‌య కేసులో న‌లుగురు దుర్మార్గుల‌కి ఉరి శిక్ష వేశారు తీహ‌ర్ జైలు అధికారులు, ఇప్పుడు మ‌న దేశంలో ఇలా ఎంత మందికి ఉరి అమ‌లు చేశారు అనేది చాలా మంది సెర్చ్ చేస్తున్నారు ..మ‌రి ఆ వివ‌రాలు చూద్దాం

దేశ రాజ్యాంగంలో పౌరులందరికీ ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఇచ్చింది. అయితే మాన ప్రాణాలు తీస్తే నేరం నిరూపితమైతే ఉరిశిక్ష విధిస్తారు.ఎవ‌రిని అయినా హ‌త్య చేసినా హ‌త్య‌కు కార‌ణం అయినా ప్లాన్ ర‌చించినా వారికి ఉరిశిక్ష వేస్తారు..1980లో సుప్రీం కోర్టు అత్యంత క్రూరమైన కేసుల్లోనే ఉరిశిక్ష వేయాలని స్పష్టం చేసింది, అంతేకాదు జిల్లా కోర్టు నుంచి సుప్రీం కోర్టు వ‌ర‌కూ ఉరిశిక్ష వేసే హ‌క్కు ఉంది…ఆనిందితులుకి గవర్నర్ రాష్ట్రపతి క్షమాభిక్షకు దరఖాస్తు చేయవచ్చు.

మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సేకు ఉరిశిక్ష వేశారు.
1989 జనవరిలో ఇందిరాగాంధీ హత్య కేసులో ఇద్దరికి ఉరిశిక్ష వేశారు.
1995లో తమిళనాడులో ఆటోశంకర్ ను ఉరితీశారు.
2004లో పదేళ్ల బాలికను హత్యచేసిన కేసులో ధనుంజయ్ చటర్జీని కోల్ కతాలో ఉరితీశారు.
2010లో ముంబై 26/11 దాడుల కేసులో ఉగ్రవాది కసబ్ ను ఉరితీశారు.
2013లో పార్లమెంట్ దాడి కుట్రదారు అప్ఝల్ గురును ఉరితీశారు.
2015లో 1993 ముంబై బాంబుపేలుళ్ల కుట్రదారుడు యాకుబ్ మెమెన్ ను ఉరితీశారు.
2020 లో ఇప్పుడు నిర్భ‌య దోషుల‌కు ఉరి ప‌డింది