NBTలో ఖాళీ పోస్టులు.. నెలకు వేతనం ఎంతంటే?

0
99

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

పూర్తి వివరాలు మీ కోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు: 03

పోస్టుల వివరాలు: ఐటీ ప్రోగ్రామర్‌, ఎడిటోరియల్‌ అసిస్టెంట్‌, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌

అర్హులు: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయస్సు: 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం:నెలకు రూ.25,000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తువిధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 18, 2022