Breaking News- హైదరాబాద్ వాసులారా అలర్ట్.. MMTS రైళ్లు రద్దు

MMTS trains canceled

0
101

ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. నగరంలో లోకల్ ట్రైన్స్ సేవలను సోమవారం రద్దు చేసినట్లు వెల్లడించింది. నగరంలోని ట్రాక్స్ నిర్వహణ పనులు చేపట్టిన నేపథ్యంలో ఎంఎంటీఎస్ సేవలను మరో రోజు పాటు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. సోమవారం సికింద్రాబాద్‌ పరిధిలో 36 ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం 79 సర్వీసులకు 36 సర్వీసులను రద్దు చేసినట్లు పేర్కొంది. సోమవారం ఒక్కరోజు మాత్రమే రద్దు చేశామని హైదరాబాద్ వాసులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.

రద్దు చేసిన సర్వీసులు ఇవే..
లింగంపల్లి – హైదరాబాద్‌ (9 సర్వీసులు)
హైదరాబాద్‌ – లింగంపల్లి (9 సర్వీసులు)
ఫలక్‌నుమా – లింగంపల్లి (8 సర్వీసులు)
లింగంపల్లి – ఫలక్‌నుమా (8 సర్వీసులు)
సికింద్రాబాద్‌ – లింగంపల్లి (1 సర్వీసు)
లింగంపల్లి – సికింద్రాబాద్‌ (1 సర్వీసు)