అమ్మాయిలని కొందరు అతి దారుణంగా హింసించి వారి చేత వ్యభిచారం చేయిస్తున్నారు, అంతేకాదు వారి ప్రాంతాల నుంచి ముంబై డిల్లీ ఇలాంటి నగరాలకు కూడా తీసుకువెళుతున్నారు.. ఇక ఆ అమ్మాయిలు మరీ రేటు ఎక్కువ వస్తారు అనుకుంటే వారికి దుబాయ్ కువైట్ మస్కట్ లాంటి దేశాలకు కూడా పంపిస్తున్నారు.
తాజాగా ఇలాంటి ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు.. ఈ ముఠాలో నలుగురు సభ్యులు ఇంటి దగ్గర పేద యువతుల తల్లిదండ్రులని మోసగిస్తున్నారు.. మీ పిల్లలకు మంచి ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతున్నారు, నెలకి 20 వేలు జీతం అని నమ్మించారు..అలాగే కొందరు అమ్మాయిల తల్లిదండ్రులకి 50 వేల రూపాయల చొప్పున పనికి అడ్వాన్స్ ఇచ్చి వారిని పనికి అని తీసుకువచ్చారు.
ఫ్యాక్టరీలో పని అని చెప్పి వారిని వ్యభిచార గృహల్లో బంధించారు, దీంతో వారి తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పడానికి లేకుండా చేశారు, వారి నుంచి సెల్ ఫోన్ తీసేసుకున్నారు..చివరకు ఒకామె ఓ కస్టమర్ నుంచి ఫోన్ చేసి పేరెంట్స్ కి ఈ విషయం చెప్పింది.. పెరెంట్స్ పోలీసులకు చెప్పారు.. ఆ ఫోన్ కాల్ వచ్చిన ఏరియాని ట్రేస్ చేసి వారిని రక్షించారు పోలీసులు.