ఆహారం విషయంలో జంతువులు ఎగిరి కూడా వాటిని తీసుకుంటాయి, ఈ సమయంలో మనుషులు ఆహారం పెట్టే సమయంలో చేతులు సరిగ్గా చూసుకోపోతే వాటి నోటికి మాంసంతో పాటు చేయి కూడా అందుతుంది, ఏకంగా చేతులు కాళ్లు కోల్పోయిన వారు ఉన్నారు, అయితే తాజాగా కోపం మనుషులకే కాదు, జంతువులకి కూడా ఉంటుంది అని నిరూపించింది ఓ మొసలి.
అమెరికా- ఫ్లోరిడా రాష్ట్రంలోని ఎవర్గ్లేడ్స్ హాలిడా పార్కులో. మొసలిపై జాలి పడుతున్నారు అందరూ.. ఎందుకు అనుకుంటున్నారా, మొసళ్లను సంరక్షించే ఓ జంట చికెన పెద్ద ముక్క ఆ మొసలికి చూపించారు అది చాలా సేపు తీసుకోవడానికి ప్రయత్నించింది.. అయితే ఆ జంట మాత్రం దానిని ఊరించారు. నోటికి అందించలేదు, తాను అది సాధించలేకపోయాను అని మొసలికి కోపం వచ్చింది.
ఆ మొసలి బాగా ఫీలైపోయింది. కోపం వచ్చి ఆ చికెన్ ని అక్కడ వదిలేసి వెళ్లిపోయింది, మళ్లీ దానిని పిలిచి ఆ మాంసం అందించారు, ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది లెట్స్ టేక్ ఏ లుక్.