నిందితుల కుటుంబ సభ్యులకు డాక్టర్లు అడిగిన ప్రశ్నలు ఇవే

నిందితుల కుటుంబ సభ్యులకు డాక్టర్లు అడిగిన ప్రశ్నలు ఇవే

0
100

దిశ కేసులో నిందితులు నలుగురు ఎన్ కౌంటర్ అయ్యారు.. చివరకు వారి అంత్యక్రియలకు 18 రోజుల తర్వాత మోక్షం వచ్చింది.. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి చెందిన నలుగురు వైద్యుల బృందం హైదరాబాద్ వచ్చి, గాంధీ ఆస్పత్రిలో రీ-పోస్టుమార్టం నిర్వహించింది. వారి నలుగురు కుటుంబ సభ్యులకు బాడీలు అప్పగించడంతో రాత్రి తొమ్మిది గంటలకల్లా నలుగురి అంత్యక్రియలు ముగిశాయి.

ముందుగా ప్రత్యేక చాంబర్లో నలుగురు హంతకుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఎయిమ్స్ ఆస్పత్రికి చెందిన నలుగురు వైద్యుల బృందం ఎన్కౌంటర్లో మీ పిల్లలు చనిపోయారు కదా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఏమైనా సందేహాలు, అనుమానాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. మేంఏమీ చెప్పదల్చుకోలేదు…పోస్టు మార్టం చేసి మా బిడ్డల మృతదేహాలు అప్పగిస్తే తీసుకుపోయి ఈ రోజే అంత్యక్రియలు చేసుకుంటామని వారు విన్నవించుకున్నారు.

వీరి శరీరాలు మొత్తం రీ పోస్టు మార్ట్ం చేశారు.. వారి శరీరానికి ఏమైనా దెబ్బలు తగిలాయా, ఎముకలు విరిగాయా వారికి విషప్రయోగం జరిగిందా ఇలా అనేక విషయాలు పోస్టుమార్టంలో చూశారు .. మొత్తం ఈ ప్రాసెస్ నాలుగు గంటల చేశారు, దీని తర్వాత 2.30 నిమిషాలకు రిపోర్ట్ సీల్ చేసి వారి నలుగురి బాడీలు కుటుంబ సభ్యులకు అందించారు.