నిర్భయ కేసులో నిందితులు ఎన్ని నాటకాలు ఆడారో మీరే చూడండి

నిర్భయ కేసులో నిందితులు ఎన్ని నాటకాలు ఆడారో మీరే చూడండి

0
114

మార్చి 20న… వినయ్ శర్మ, పవన్ గుప్తా….ముఖేష్ సింగ్…అక్షయ్ టాగూర్ కి ఉరిశిక్ష విధించనున్నారు.. ఇప్పుడు నాలుగవ సారి వారికి డెత్ వారెంట్ ఇష్యూ చేసింది కోర్టు… అసలు వీరు దొరికిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేశారు.. కోర్టులో కేసు నడిచింది, వీరి కోసం ఈ కేసు విచారణపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశారు,

వారికి ఏడాదిలోపే విచారణలో ఉరిశిక్ష పడింది, అక్కడ నుంచి తర్వాత వీరు హైకోర్టుని ఆశ్రయించారు, తర్వాత ఇక్కడే కాలం వెల్లదీశారు, ఆ తర్వాత సుప్రీం కోర్టుకు వచ్చారు, ఇక్కడ పలు సార్లు వీరి కేసు వాయిదా పడుతూ చివరకు డెత్ వారెంట్ జారీ అయింది.

2012లో ఈ ఘటన జరిగితే 2020 లో ఉరి శిక్ష కి డెత్ వారెంట్ ఇచ్చారు.. ఉరిశిక్ష ఖరారు అయి నెలల గడుస్తున్నా వీరు లాలో ఉన్న లొసుగులు ఉపయోగించుకుని తప్పించుకునేందుకు చూశారు, కాని సాక్ష్యాదారాలు బలంగా ఉండటంతో వారికి బయటకు వచ్చే అవకాశం దొరకలేదు..

మొదటి డెత్ వారెంట్ జనవరి 22న ఇచ్చారు, ఇది నాల్గవ డెత్ వారెంట్. ఒకరి తర్వాత ఒకరు క్యూరేటీవ్ పిటీషన్లు వేశారు, అలాగే క్షమాబిక్ష కోసం రాష్ట్రపతికి అపీల్ చేశారు కానీ వీరికి అన్నీ చోట్లా ఎదురుదెబ్బ తగిలింది. పవన్ గుప్తా తాను అప్పటికి మైనర్ అని కొత్త అంశం తెచ్చాడు, అయినా వీరి పాపం పండింది.