నిర్భయ నిందితులు నలుగురు జైల్లో ఏం చేస్తున్నారంటే

నిర్భయ నిందితులు నలుగురు జైల్లో ఏం చేస్తున్నారంటే

0
47

నిర్భయ కేసులో నిందితులకి మార్చి 20న ఉరి శిక్ష అమలు చేయనున్నారు.. ఇక న్యాయపరంగా అన్ని అవకాశాలు అయిపోయాయి..ఇక ప్రత్యామ్నాయం లేదు కాబట్టి వీరు సరికొత్త నాటకాలు ఆడే అవకాశం ఉంది కాబట్టి జైలు అధికారులు కూడా వీరిని సింగిల్ గా సెల్ లో ఉంచుతున్నారు, నలుగురిని కలిపి ఉంచితే ఒకరిని ఒకరు కొట్టుకుని… కావాలనే దాడి చేసుకుని ఆస్పత్రికి గాయాలతో వెళతారు.

దీని వల్ల వీరికి ఉరి మరింత లేట్ అయ్యే అవకాశం ఉంటుంది, అందుకే వీరికి జైలులో వారు ఉన్న సెల్ లో ఎలాంటి ఆయుదాలు లేకుండా చేశారు చివరకు వీరికి పేపర్ ప్లేట్స్ లాంటి వాటిలో భోజనాలు పెడతారు అని తెలుస్తోంది, ఏ వస్తువు వీరికి దొరికినా దానితో తప్పించుకునేందుకు ప్లాన్ వేస్తారని జైలు అధికారులు ఇలా చేస్తారట..

పూర్తిగా ఆరోగ్యం లేకపోతే వారికి ఉరి అమలు చేయరు… అది వారికి తెలిసిందే, అంతేకాదు బీపీ డౌన్ ఉండకూడదు, ఏదైనా ప్రమాదం జరిగితే ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి వారు తప్పించుకుంటారు అని జైలు అధికారుల ఆలోచన, అయితే నలుగురు నిందితులు సాధారణంగానే ఉన్నారట, రోజులు లెక్క బెట్టుకుంటున్నారట.నలుగురిని ఐసోలేట్ చేసి ప్రత్యేక సెల్స్ లో ఉంచారు, ఇక ఉరికి సంబంధించి అన్నీ ఏర్పాట్లు చేశారు తీహర్ జైలు అధికారులు.