నిర్భయ దోషుల ఉరిశిక్ష తేది మారింది జనవరి 22 కాదు మరి ఎప్పుడంటే

నిర్భయ దోషుల ఉరిశిక్ష తేది మారింది జనవరి 22 కాదు మరి ఎప్పుడంటే

0
46

నిర్భయ దోషుల ఉరిశిక్ష పడుతుందా లేదా అనే అనుమానం అందరిలో ఉంది.. అయితే రాష్ట్రపతి క్షమాబిక్ష మళ్లీ తిరస్కరించడంతో వారికి ఉరి శిక్ష అమలు చేయనున్నారు, అయితే ఇక ఎవరు ఇలా క్షమాబిక్ష పెట్టుకున్నా వారికి అవకాశం కల్పించేది లేదు అనేది తేల్చిచెప్పారు.. దీంతో ఇక మరోసారి వారికి అవకాశం ఉండదు అనేది తెలుస్తోంది.

అనేక సందిగ్దల నడుమ నిర్భయ దోషుల ఉరిశిక్షకు తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 1వ తేదీని ఉదయం 6 గంటలకు ఉరిశిక్షను అమలు చేయనున్నారు. ఈ మేరకు డెత్ వారెంట్ జారీ అయింది. ఢిల్లీలోని తీహార్ జైల్లో నలుగురు దోషులను ఉరి తీయనున్నారు. దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్ ను ఈ ఉదయం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించిన సంగతి తెలిసిందే.

ఇక చట్టాల ప్రకారం ఈ శిక్ష అమలు ఎలా జరుగుతుంది అంటే ,ఈ రోజు నుంచి 14వ రోజున ఉరిశిక్షను అమలు చేయబోతున్నారు. క్షమాభిక్షను నిరాకరించిన పక్షంలో చట్టం ప్రకారం ఉరిశిక్ష విధించడానికి రెండు వారాల గడువు ఉండాలి. అయితే పటియాల కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈనెల 22న నలుగురు దోషులకు ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉంది. దోషులకు మరో 10 రోజులు జీవించే అవకాశం కలిగింది. మొత్తానికి వారికి మరో 14 రోజులు మాత్రమే సమయం ఉంది.