354 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌..పూర్తి వివరాలివే..

0
254

న్యూఢిల్లీ: రక్షణ శాఖ ఆధ్వర్యంలోని సరిహద్దు రహదారుల సంస్థలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఆన్‌లైన్‌ అప్లికేషన్లు వచ్చే 3 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా 354 పోస్టులను భర్తీ చేస్తుంది. ఇందులో మల్టీ స్కిల్‌ వర్కర్‌, మెకానిక్‌, డ్రైవర్‌ వంటి పోస్టులు ఉన్నాయి. పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని బీఎస్‌ఎఫ్‌ తెలిపింది.

మొత్తం పోస్టులు: 354

మల్టీ స్కిల్డ్‌ వర్కర్‌ పెయింటర్‌ 33, మల్టీ స్కిల్డ్‌ వర్కర్‌ మెస్‌ వెయిటర్‌ 12, వెహికల్‌ మెకానిక్‌ 293, డ్రైవర్‌ మెకానికల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ 16
అర్హత, వయస్సు, ఎంపిక విధానం సంబంధిత వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ చూడవచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులకు చివరితేదీ: 2022, జనవరి 3

వెబ్‌సైట్‌: www.bro.gov.in