పాల శేషాద్రి..డాలర్ శేషాద్రిగా ఎలా మారారంటే?

Pala Seshadri..How to become a Dollar Seshadri?

0
90

డాలర్ శేషాద్రి అలియాస్ పాల శేషాద్రి. డాలర్ శేషాద్రి అనే పేరు యావత్ ఆంధ్రదేశంలోనే కాదు.. దేశ విదేశాల్లోనూ అందరికీ తెలుసు. అంతగా పేరు ప్రతిష్టలు సాధించారు డాలర్ శేషాద్రి. స్వామి వారి ఉత్సవ విగ్రహాల పక్కన నిత్యం కనిపిస్తూ..ఉత్సాహంగా ఉంటూ పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో పదవీ విరమణ చేసినా..పదవీకాలాన్ని పొడగించుకొని స్వామి వారి సేవలోనే ఉన్నారు శేషాద్రి. దీనిపై అప్పట్లో హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా శేషాద్రి మాత్రం మారలేదు. స్వామివారి సేవలో తరిచడం డాలర్ శేషాద్రికి అందిన వరం. నియమ నిబంధనలు, అధికారిక హోదాలు, ఆలయ పద్దతులు ఇవేవీ శేషాద్రికి అడ్డురావు.

వీఐపీలు ఎవరైనా స్వామి వారి దర్శనానికి వచ్చారంటే..ముందుగా దర్శించుకునేది డాలర్ శేషాద్రే. వీఐపీలకు రాచమర్యాదలు చేస్తూ..గర్భగుడిలోకి తీసుకెళ్తారు డాలర్ శేషాద్రి. డాలర్ శేషాద్రి మెడలో ఓ డాలర్ ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఆయనకు డాలర్ శేషాద్రిగా పేరు వచ్చింది. డాలర్ల తయారీ, అమ్మకాలు శేషాద్రే పర్యవేక్షించేవారు. అప్పటినుంచి పాల శేషాద్రి పేరు కాస్తా డాలర్ శేషాద్రిగా మారిపోయింది.