ఈ గుట్కాలు అనేదే చెండాలమైన అలవాటు… కాని కొందరు దీనికి బాగా అలవాటు పడుతున్నారు. తినకపోతే మానసికంగా ఇబ్బంది పడుతున్నారు.. ప్రభుత్వం కొన్ని చోట్ల వీటి అమ్మకాలు బ్యాన్ చేసింది అయినా చిన్న చిన్న పచారి పాన్ షాపుల్లో ఇవి అమ్ముతున్నారు, ఈ కరోనా సమయంలో ఎక్కడ ఆపాన్ సిగరెట్లు అమ్మడానికి వీలు లేదు… ఎందుకు అంటే తిని రోడ్లపై ఉమ్మి వేస్తారు కాబట్టి, దేశంలో ఎక్కడా ఇవి అమ్మడం లేదు.
ఈ సమయంలో ఓ పాన్ షాపు పక్కన నివాసం ఉండే యువకుడు రాత్రి పూట షాపు తీసీ గుట్కా ఇవ్వమన్నాడు….కాని ఓనర్ ఇవ్వనన్నాడు… పోలీసులు తనని అరెస్ట్ చేస్తారని ఇవ్వను అన్నాడు, అయితే తాను అడిగితే ఇవ్వవా అని గొడవ పడ్డాడు, ఇలా ఇద్దరూ వాదులాడుకున్నారు.
చివరకు ఆ యువకుడు అతనిని ఇనుప రాడ్ తొ కొట్టాడు, దీంతో అతను అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు, వెంటనే స్ధానికులు అతనిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు.. కాని అతను మధ్యలో చనిపోయాడు, వెంటనే పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు, చివరకు జైలు పాలయ్యాడు.