పెళ్లికి ఒప్పుకోవడం లేదని ప్రేమికుడు బస్టాప్ లో ఎంత దారుణం చేశాడో తెలిస్తే షాక్

పెళ్లికి ఒప్పుకోవడం లేదని ప్రేమికుడు బస్టాప్ లో ఎంత దారుణం చేశాడో తెలిస్తే షాక్

0
81

ప్రేమించిన అమ్మాయి తన ప్రేమ ఒప్పుకోకపోతే వారిపై దాడి చేయడం, యాసిడ్ పోయడం కత్తితో పొడవడం ఇలాంటి చర్యలకు కొందరు యువకులు పాల్పడుతున్నారు.. అయితే ఇద్దరు ప్రేమించుకుంటేనే ప్రేమ, ఒకరు ప్రేమించి మరొకరి వెంట పడితే అది ప్రేమ ఎలా అవుతుంది.

కాని ఓ దుర్మార్గుడు తను ప్రేమించిన అమ్మాయి తనతో పెళ్లికి నిరాకరించిందని ఆమెపై పగ పెంచుకున్నాడు.. బస్టాప్ లో ఆమె బస్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో ముగ్గురు స్నేహితుల సాయంతో, ఆమెను కారులోకి ఎక్కించారు. వెంటనే అక్కడకు ప్రేమించిన యువకుడు వచ్చాడు.

అందరి మధ్యలో ఆమెకి తాళికట్టాడు, తర్వాత ఆమెని కారులో ఫ్రెండ్ ఇంటికి తీసుకువెళ్లాడు, కుమార్తె కనిపించడం లేదు అని తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. సెల్ ఫోన్ ద్వారా ఆమె ఎక్కడ ఉందో తెలుసుకుని కాపాడారు పోలీసులు, అయితే అతను వరుసకి బావ అవుతాడు అని తెలుస్తోంది, దీంతో యువతి తండ్రి మనస్ధాపానికి గురై ఆత్మహత్యకి పాల్పడ్డాడు.. ప్రస్తుతం అతను చికిత్స తీసుకుంటున్నాడు అని పోలీసులు తెలిపారు.