పట్టపగలే హైదరాబాద్ లో ఆటోడ్రైవర్ ని 10 మంది కత్తులతో పొడిచి చంపారు..

పట్టపగలే హైదరాబాద్ లో ఆటోడ్రైవర్ ని 10 మంది కత్తులతో పొడిచి చంపారు..

0
101

హైదరాబాద్ శివారులో దారుణం జరిగింది… జగద్గిరిగుట్టకు చెందిన ఆటో డ్రైవర్ ను గుర్తు తెలియని 10 మంది వ్యక్తులు కత్తులతో పోడిచి చంపారు… స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతుంది.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

బంజారా హిల్స్ ప్రాంతానికి చెందిన ఫయాజ్ అనే వ్యక్తి కొంత కాలంగా జగద్గిగిరి గుట్టలో నివాసం ఉంటున్నాడు అక్కడ ఆటో నడుపుకుంటూ ఉన్నాడు.. అక్కడ స్థానికంగా ఉన్న కొందరి వ్యక్తులతో ఫయాజ్ కు విభేదాలు ఉన్నాయి.. హత్య జరగడానికి మూడు రోజుల కిందట ఫయాజ్ వారితో గొడవపడ్డారు…

ఈరోజు మధ్యాహ్నం ఫయాజ్ పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు… ప్రాణాపాయంతో పరుగులు తీసిన ఫయాజ్ చివరకు ఒక ఇంటి ముందు కింద పడిపోయాడు.. దీంతో మరోసారి అతనిపై కత్తులతో దాడి చేయడంతో ఫయాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…