పెళ్లి అయిన గంటలో నదిలో దూకిన పెళ్లి కూతురు

పెళ్లి అయిన గంటలో నదిలో దూకిన పెళ్లి కూతురు

0
93

ఆమె అప్పుడే వివాహం చేసుకుంది, కాని అత్తగారి ఇంటికి వెళుతున్న సమయంలో నేరుగా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది, ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని షియోపూర్లో ఆదివారం చోటుచేసుకుంది.
రాజస్తాన్ అలపుర్కు చెందిన ఓ యువతికి ఆదివారం పెళ్లైంది. ఆ తర్వాత ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో పెళ్లి కూతురిని అత్తారింటికి సాగనంపే వేడుక జరిగింది.

తర్వాత ఆమె కారులో అత్తమామ భర్తతో కలిసి మధ్యప్రదేశ్ షియోపూర్ కి బయలు దేరింది. ఉదయం 7 గంటల ప్రాంతంలో కారు మధ్యప్రదేశ్, షియోపూర్ చంబల్ నదిపై ఉన్న పాళి వంతెనపై వెళుతోంది. తనకు వాంతి వస్తోందని, కారు ఆపాలని వధువు డ్రైవర్ను కోరింది. అయితే డ్రైవర్ ఇందుకు ఒప్పుకోలేదు.

ఆమె స్టీరింగ్ ను తిప్పేసింది, దీంతో లోపల వారికి ఏం జరుగుతుందో అర్దం కాలేదు, ఇలా ఆమె కారుదిగి నదిలో దూకేసింది.ఇంకా ఆమె ఆచూకి తెలియలేదు.. అయితే వివాహం ఇష్టమేనా? ప్రేమ వ్యవహరం ఏమైనా ఉందా అనేది కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.