కొవిడ్-19 సోకితే క్వారంటైన్ కేంద్రానికి వెంట తీసుకువెళ్లాల్సిన వస్తువులు ఇవే

కొవిడ్-19 సోకితే క్వారంటైన్ కేంద్రానికి వెంట తీసుకువెళ్లాల్సిన వస్తువులు ఇవే

0
36

చాలా మంది టెస్ట్ చేయించుకున్న తర్వాత వైరస్ సోకితే వారు వెంటనే కోవిడ్ ఆస్పత్రికి వెళ్లాల్సిందే..
ఈ సమయంలో బాధితులు ఆస్పత్రికి ఏం ఏం తీసుకువెళ్లాలి అని ఓ బాధితురాలు తెలియచేసింది.
కరోనా రోగి క్వారంటైన్ కేంద్రానికి వెళ్లేముందు మొబైల్ ఫోన్, ఛార్జర్, పవర్ బ్యాంక్ ను వెంట తీసుకువెళ్లాలని సూచించారు.

ఆసుపత్రి క్వారంటైన్ కేంద్రంలో వేడినీళ్లు తాగేందుకు పోస్తుంటారని, దీనికోసం ప్లాస్టిక్ కాకుండా స్టీలు బాటిల్, ఓ గ్లాసు తీసుకుపోవాలని కోరారు. ఆసుపత్రిలో అల్పాహారం, భోజనం, డిన్నర్ అందిస్తారని, కాని మధ్యలో ఆకలివేస్తే తినేందుకు పండ్లు, సిట్రిస్ పండ్లు తీసుకోవాలి అని తెలిపారు.

డ్రై ఫ్రూట్లను వెంట తీసుకువెళ్లాలని తెలిపారు.. మరుగుదొడ్లలో పరిశుభ్రత కోసం సొంత టవల్, సబ్బు, షాంపూ, టూత్ బ్రష్, పేస్ట్ వెంట తీసుకువెళ్లాలని సూచించారు.కచ్చితంగా ఓ ఐదారు జతల బట్టలు తీసుకువెళ్లాలి.14 రోజులు అక్కడ ఉండాలి కాబట్టి మీరు చదివే పుస్తకాలు ఏమైనా తెచ్చుకోండి.