అతని పేరుమీద ఓ ట్రస్ట్ పెట్టాడు,పైగా ఓ దేవుడు అంటే తనకు ప్రేమ అని చెప్పాడు, ఇలా ఆ దేవుడ్ని ప్రేమించేవారు ఈ ట్రస్ట్ వ్యక్తిని నమ్మి లక్షల రూపాయలు ఇచ్చి పేదలకు అనాధలకు సాయం చేయమని నగదు పంపేవారు… ఎన్నారైలు కూడా ఇలా నగదు ఇచ్చేవారు.. కాని ఆ లెక్కా పత్రాలు ఎవరూ అడిగేవారు కాదు.. ఓ 20 మందికి సాయం చేస్తూ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పలానా వారు సాయం చేశారు అని చెప్పేవాడు.
ఇలా వేరే వారి ట్రస్ట్ లకు వెళ్లి అక్కడ పలు ఫోటోలు దిగి ఉదయం సాయంత్రం వారికి భోజనం ఓరోజు అందించి అవే మార్చి మార్చి ఫోటోలు పెట్టేవాడు, చివరకు ఇతనిపై అనుమానం వచ్చిన ఓ ఎన్నారై పోలీసులకు చెప్పాడు, రోజు ఇతను సుమారు ఇలా 3 లక్షలు సొమ్ము రప్పించుకుంటున్నాడు విరాళాల ద్వారా.
ఇలా సిటీ అవుట్ కట్స్ లో పెద్ద విల్లా కొనుక్కున్నాడట, అంతేకాకుండా ఈ నగదులో ఓ ప్లాస్టిక్ పరిశ్రమ పెట్టాడట.. వారి ఊరిలో 10 ఎకరాల వ్యవసాయ పొలం కొన్నాడట, ఈ డబ్బు అంతా పేదలకు పంపిందే అని తెలిసి అతనిపై చీటింగ్ కేసు పలు కేసులు నమోదు చేశారు, ఇలాంటి వారిని నమ్మకండని సేవ చేసే వారికి సాయం చేయాలి అని పోలీసులు తెలిపారు.