పిల్లలని దత్తత తీసుకోవాలంటే లీగల్ గా ఏం చేయాలి ఎలా నమోదు చేసుకోవాలి తప్పక తెలుసుకోండి

పిల్లలని దత్తత తీసుకోవాలంటే లీగల్ గా ఏం చేయాలి ఎలా నమోదు చేసుకోవాలి తప్పక తెలుసుకోండి

0
143
child adoption

చాలా మందికి పిల్లలు ఉండరు వీరు ఎంతో బాధపడుతూ ఉంటారు, అయితే పిల్లల కోసం ఎంత ప్రయత్నించినా పుట్టకపోతే చివరకు వారు అనాధలని తెచ్చి పెంచుకుంటారు, మరికొందరు తమకు పిల్లలు వద్దు అని నేరుగా అనాధలని తెచ్చి పెంచుకుంటారు, ఇదినిజంగా చాలా గొప్ప పని అని చెప్పాలి, అయితే ఇలా పిల్లలని దత్తత తెచ్చుకోవాలి అంటే రూల్స్ ఏమి ఉంటాయి అనేది చూద్దాం.

1.. పిల్లలని దత్తత తీసుకోవాలి అంటే కచ్చితంగా మేజర్లు అయి ఉండాలి.
2. భార్య అనుమతి తప్పనిసరిగా ఉండాలి
3. విడాకులు తీసుకున్న జంట, విడిపోవడానికి సిద్దంగా ఉన్న జంట ఇలా దత్తత తీసుకోవడానికి లేదు
4. ఇద్దరు భార్యలు ఉంటే ఇద్దరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి దత్తత తీసుకుంటున్నట్లు
5. భార్య చనిపోయినా దత్తత తీసుకోవాలి అంటే మీరు మానసికంగా బాగున్నారు అనే సర్టిఫికెట్ ఇవ్వాలి
6.. అనాథాశ్రమం నిర్వహించే సంరక్షకుడు మాత్రమే దత్తత ఇచ్చేందుకు చట్టబద్ధంగా అర్హుడు.
7. లీగల్ గా నమోదు అయిన అనాధాశ్రమంలోనే ఇలా దత్తత తీసుకోవాలి
8.15 ఏళ్లు నిండన పిల్లలను మాత్రమే దత్తత తీసుకోవడానికి వీలుంటుంది…
9. ఎవరిని దత్తత తీసుకున్నా కోర్టుకి తెలిపి అనుమతి తీసుకోవాలి
10. మీరు ఓ అమ్మాయిని దత్తత తీసుకుంటే ఆ తండ్రి అమ్మాయి వయసు కంటే 21 ఏళ్లు పెద్దవాడు అయి ఉండాలి
11.స్త్రీ- శిశు సంక్షేమశాఖ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. అక్కడ నమోదు అయి మీ పాన్ కార్డుతో నమోదు అవ్వాలి
12. మీ దృవ పత్రాలు అన్నీ తీసుకుని అవి చూసి ఆ దంపతులకి పర్మిషన్ ఇస్తారు
13. ఇక ఇలా దత్తత ఇచ్చే సమయంలో ఇద్దరు వ్యక్తులు సిఫార్సు కూడా మీకు చేయాలి అంటే నమ్మకస్తులుగా
14. ఇక దంపతులు పెళ్లి అయింది అని ఫ్రూఫ్ గా పెళ్లి ఫోటో ఇవ్వాలి
15..ఆరు వేల రూపాయల డీడీ అప్లికేషన్ ఫారంతో పాటు 40 వేల రూపాయలను దత్తత తీసుకునే సమయంలో సంబంధిత అనాథాశ్రమానికి డీడీ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. ఈ రూల్స్ పాటించాలి, ఇది లీగల్ ప్రాసెస్