సన్ ఫ్లవర్ మనం వంటల్లో ఈ ఆయిల్ బాగా వాడతాం, అయితే పొద్దుతిరుగుడు పువ్వుకి సూర్యుడికి సంబంధం ఉంది,
పొద్దు ఎటు తిరిగితే అటు సూర్యుడు దిశగా ఈ పువ్వు తిరుగుతుంది…అందుకే దీన్ని పొద్దు తిరుగుడు పువ్వు అని అంటారు.
మరి లాజిక్ ఏమిటి – ఎందుకు ఇలా తిరుగుతుంది అంటే సైన్స్ దీని వెనుక ఉంది మరి అది చూద్దాం.
రీసెర్చ్ లో తేలింది ఏమిటి అంటే.. పొద్దు తిరుగుడు పువ్వు కాడల్లోని మూలకణాల ప్రత్యేక ఎదుగుదల వల్లే సన్ ఫ్లవర్ సూర్యుడివైపు తిరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పువ్వులో ఉన్న కాడ మూల కణాలు ముఖ్యంగా తూర్పువైపు ఉన్న మూల కణాలు పెరుగుతూ ఉంటాయి, ఇలా పువ్వు అటువైపు తిరిగి ఉంటుంది… ఇలా సూర్యుడు ఉండే వైపునకు వంగిపోతుంది. పువ్వు ఉష్ణోగ్రతను గ్రహించడం కారణంగా ఇలా జరుగుతుందని తేల్చి చెప్పారు.
ఇలా గతంలో పరిశోధన చేశారు, ఇలా సూర్యడు నుంచి ప్రసరితమవుతున్న ఎండ ప్రకారం ఈ పువ్వు ఇలా వాలుతూ కనిపిస్తూ ఉంటుంది, చాలా రోజులు ఇలా కెమెరాలతో దీనిని పరిశీలించి ఈవిషయం తెలుసుకున్నారు… ఇక ఇందులో దాదాపు 30 రకాల పూల మొక్కలు ఉన్నాయి అని తెలియచేస్తున్నారు వృక్షశాస్త్ర్రవేత్తలు.