ఆగస్టు 28న పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష..హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోండిలా?

0
49

తెలంగాణ ప్రభుత్వం గత ఏప్రిల్‌ నెలలో పోలీసుశాఖలో 15,644, రవాణాశాఖలో 63, ఆబ్కారీ శాఖలో 614 మంది కానిస్టేబుళ్ల పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఎస్సై ఉద్యోగాలకు ఆగస్టు 7వ తేదీన పరీక్ష నిర్వహించగా..పరీక్షా ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈనెల 21న జరగాల్సిన కానిస్టేబుల్ ప్రాధమిక పరీక్షను 28న పరీక్ష నిర్వహిస్తున్నట్లు పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇటీవలే తెలిపింది.

ఈ ప్రాధమిక పరీక్ష వాయిదా పడడానికి పరిపాలనాపరమైన సమస్యలు కారణమని అధికారులు వెల్లడించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఈ పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి హాల్‌టికెట్లను ఆగస్టు 18వ తేదీ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని నియామక మండలి చైర్మన్‌ తెలిపారు.

అభ్యర్థులు పూర్తి వివరాలకు, హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి https://www.tslprb.in/ వెబ్‌సైట్‌ ని సంప్రదించాలని ఈ మేరకు తెలియజేసారు. ఈ ఉద్యోగాలకు మొత్తం 9.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష నిర్వహణ కోసం హైదరాబాద్‌ సహా 40 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.