ప్రేమ విఫలం అయిందని యువకుడు ఆత్మహత్య….

ప్రేమ విఫలం అయిందని యువకుడు ఆత్మహత్య....

0
116

తన ప్రేమ విఫలం అయిందని యవకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈసంఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… తిమ్మక్ పల్లికి చెందిన గుర్రాల సాయవ్వ నారాయణ దంపుతులు గతంలో భ్రతుకు దెరువు కోసం కామారెడ్డికి వచ్చారు… అర్థిక ఇబ్బందులు వల్ల గతంలో నారాయణ ఆత్మ హత్య చేసుకున్నారు…

దీంతో భార్య సాయవ్వ బీడిలు చుడుతూ తన ముగ్గురు పిల్లలను పోషిస్తోంది… చిన్న కుమారుడు సంతోష్ తన సోదరులతో కలిసి హైదరాబాద్ లో డ్రైవర్ గా పని చేస్తున్నారు.. అక్కడ సంతోష్ ఒక యువతి ప్రేమలో పడ్డాడు… ఇక ఈ విషయం యువతి తల్లికి తెలియడంతో సంతోషన్ మందలించి తన బిడ్డను వరంగల్ కు తీసుకువెళ్లింది…

ఇకఅప్పటినుంచి కుంగిపోయిన సంతోష్ ప్రియురాలికి ఫోన్ చేస్తూ కొంత కాలంగా మధనపడేవాడు…. ఇక నీ ఎడబాటును భరించలేనంటూ టిక్ టాక్ వీడియో చేసి దాన్ని యువతికి పంపించాడు..ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు… విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..