నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత పోలీసులని ఓ కోరిక కోరిన దిశ తల్లి

నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత పోలీసులని ఓ కోరిక కోరిన దిశ తల్లి

0
88

దిశని అత్యంత పాశవికంగా చంపిన ఈ నలుగురు దుర్మార్గులను పోలీసులు ఈరోజు తెల్లవారు జామున ఎన్ కౌంటర్ చేశారు. ముఖ్యంగా వారు నలుగురు పారిపోయేందుకు ప్రయత్నించిన సమయంలో వారిపై తుపాకి తూటాలు ప్రయోగించారు పోలీసులు. నలుగురు నిందితులు ఈ కాల్పుల్లో మరణించారు. దీంతో దేశ వ్యాప్తంగా తెలంగాణ పోలీసులు చేసిన చర్య అభినందనీయం అని చెబుతున్నారు.. అంతేకాదు నెటిజన్లు కూడా ఆమెకు న్యాయం జరిగింది అని చెబుతున్నారు.

తాజాగా దిశ కుటుంబ సభ్యులు కూడా ఈ ఎన్ కౌంటర్ గురించి మాట్లాడారు. పోలీసులు చంపిన ఈ నలుగురి మృతదేహాలనూ చూడాలని అనిపిస్తోందని వెటర్నరీ వైద్యురాలు దిశ తల్లి కోరారు. ఈ ఉదయం తనను కలిసిన మీడియాతో మాట్లాడిన ఆమె, షాద్నగర్ దగ్గర ఎన్కౌంటర్ చేసినట్లు తనకు తెలిసిందని అన్నారు. ఉదయం టీవీ చూసిన సమయంలో తమకు ఈ వార్త తెలిసిందని, తనకు గుండెల్లో ఉన్న బాధ కొంచెం తగ్గింది అని తెలిపారు ఆమె. పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

దిశ మరణించిన 10 రోజులకు న్యాయం జరిగిందని, ఇందుకు పోలీసులకు, మీడియాకు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. తమ బిడ్డ లేదు అనేది తాను తట్టుకోలేకపోతున్నా అని, ఏ చిన్నప్రాణికి కూడా అపకారం చేయని ఆమెని అత్యంత దారుణంగా చంపారు అని ఇలాంటి పరిస్దితి ఎవరిక రాకూడదు అని ఆమె తెలియచేశారు.