తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం భోగి పండుగ ఏకాంతంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి ధనుర్మాస కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తరువాత సహస్రనామార్చన చేపట్టారు. సాయంత్రం శ్రీ ఆండాళ్ అమ్మవారిని, శ్రీకృష్ణస్వామి వారిని భోగితేరుపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారంలో ఊరేగింపు నిర్వహించారు. కోవిడ్-19 నిబంధనల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ రవికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ వెంకటాద్రి, శ్రీ నారాయణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కామరాజు, శ్రీ ధనుంజయ్ పాల్గొన్నారు.
తి.తి.దే.ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.