రైలులో ఈ దొంగని ఎలా పట్టుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు

రైలులో ఈ దొంగని ఎలా పట్టుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు

0
90

మనం చాలా సార్టు ఆదమరుపులో ఫోన్ మాట్లాడుతూ ఉంటాం, ఈ సమయంలో దొంగలు వచ్చి ఫోన్ పట్టుకుపోయినా మనం స్పందించేలోపల వారు చటుక్కున పారిపోతారు.. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది.. కాని దొంగ మాత్రం దొరికిపోయాడు.

తన చేతిలోని స్మార్ట్ ఫోనును లాక్కుని పారిపోతున్న ఓ దొంగను, అతని వెనుకే పరిగెట్టి పట్టుకున్నాడో యువకుడు. నిన్న జరిగిన ఈ ఘటన ఆ దొంగకు గుణపాఠం చెప్పింది, ఫలక్ నుమా నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఎంఎంటీఎస్ రైలును ఉప్పుగూడ స్టేషన్ లో సాయితేజ అనే యువకుడు ఎక్కాడు. ఈ సమయంలో తనతో పాటు వందల మంది ప్రయాణికులు ఉన్నారు.

రైలు మలక్ పేట స్టేషన్ దగ్గరకు వచ్చిన సమయంలో ఫోన్ మాట్లాడుతూ ఉండగా, ఓ దొంగ వచ్చి, ఫోన్ లాక్కుని, నడుస్తున్న రైలు నుంచి దూకి పరుగుతీశాడు కాని తేజ మాత్రం తన ఫోన్ కోసం రైలునుంచి దూకాడు.. వెంటనే అతన్ని పట్టుకున్నాడు.. దొంగ దొంగ అనడంతో అందరూ అతనిని పట్టుకున్నారు అందరూ కలిసి రైల్వే పోలీసులకు అప్పగించారు. నిందితుడిని ఉప్పుగూడకు చెందిన రియాజ్గా గుర్తించామని, కేసును దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. చూశారుగా ఫోన్ మాట్లాడే సమయంలో రైలులో అప్రమత్తత అవసరం