రజస్వల అయిన అమ్మాయిపై ఈ ఆచారాలు మూఢనమ్మకాలు పాటించకండి

రజస్వల అయిన అమ్మాయిపై ఈ ఆచారాలు మూఢనమ్మకాలు పాటించకండి

0
111

చిన్న వయసులో రజస్వల అయిన అమ్మాయికి పాపం ఏమీ తెలియదు, చిన్న వయసు ఈ సమయంలో కొందరు పెద్దలు పాత పద్దతుల ప్రకారం ఆనాటి మూడనమ్మకాలు ఆచారాలు వారిపై కూడా రుద్దుతారు,
ముఖ్యంగా కప్పులకొద్దీ నూనె తాగించడం, ఇష్టంలేకపోయినా తినే ఆసక్తి లేకపోయినా నోట్లో బెల్లం కుక్కేయడం చేస్తారు, ఇది దారుణమైన ఆచారం.

ఆకులమీద, చాపలమీద రోజులతరబడి కూర్చోబెట్టడం, మరిముఖ్యంగా రోజులతరబడి స్నానం చేయించకపోవడం, వంటరిగా గదిలోపెట్టి ఉంచడం ఇలాంటి పనుల వలన పిల్లల్లో ఒకరకమయిన భయం వస్తుంది, వీటిని అంతగా పాటించరు చాలా మంది యూపీ రాజస్ధాన్ లో కూడా వీటిని అంతగా చేయరు, పిల్లలకు ఈ మార్పుల గురించి చెప్పాలి అంటున్నారు నిపుణులు.

గతంలో చాలా మంది మూఢనమ్మకంగా ఇవి పాటించేవారని ఆకులు కాదని బెడ్ షీట్ లాంటివి ఇవ్వవచ్చని అంటున్నారు, కొందరు ఏకంగా పరుపులు కూడా కుట్టింది కూతురికి ప్రేమతో అక్కడ ఉండమని వేస్తారు, ఇష్టం లేని ఆహారం కావాలి అని ఈ సమయంలో పెట్టద్దు అంటున్నారు నిపుణులు.