వేగంగా కూల్ డ్రింక్ తాగి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం

Ranking Guinness Book of World Records for Fast Cool Drink

0
20

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించేందుకు చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తారు. వారి టాలెంట్ తో ఈ రికార్డులు నెలకొల్పుతారు. మన దేశంలో కూడా చాలా మంది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారు. మరి తాజాగా అమెరికా పౌరుడు ఓ రికార్డ్ క్రియేట్ చేశారు. అతని పేరు ఎరిక్ బ్యాడ్ లాండ్స్ బూకర్ .

ఇంతకీ ఎరిక్ నమోదు చేసిన రికార్డు తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. మనం చాలా సార్లు రెండు లీటర్ల డ్రింక్ బాటిల్స్ దింపకుండా తాగిన వారికి చూస్తాం. అయితే చాలా వేగంగా తాగిన వారు ఎవరు అంటే నిమిషాల్లోనే వారు తాగుతారు. కాని ఎరిక్ మాత్రం ఓ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు.

2 లీటర్ల కూల్ డ్రింక్ ను ఓ పాత్రలో పోసి, కేవలం 18.45 సెకన్లలో తాగేశాడు. రెండు లీటర్ల కూల్ డ్రింక్ ను ఇంత వేగంగా ఎవరూ తాగలేదంటూ గిన్నిస్ బుక్ వారు రికార్డుగా నమోదు చేశారు. అసలు ఇంత వేగంగా తాగడం చూసి అందరూ షాక్ అయ్యారు. ఎరిక్ ర్యాపర్, ప్రఖ్యాత యూట్యూబర్ కూడా. ఇక నిమిషాలు సమయం పడుతుంది ఎవరికి అయినా ఇది తాగాలి అంటే, కాని అతను సెకన్లలోనే తాగేశాడు. ఇక ఈయన అనేక ఫుడ్ రికార్డులు నమోదు చేశాడు. మరి మీరు ఆ డ్రింక్ తాగిన వీడియో చూసేయండి.

వీడియో చూడండి

https://www.youtube.com/watch?v=2Y9o6QNCViM&t=155s