పోస్టల్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల..అర్హులు వీళ్ళే

0
87

డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, ముంబై, మహారాష్ట్ర, ఇండియన్ పోస్ట్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జనరల్ సర్వీస్ గ్రూప్ సి నాన్-గెజిటెటెడ్, నాన్ మినిస్ట్రియల్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు.

పూర్తి వివరాలు మీ కోసం

మొత్తం ఖాళీల సంఖ్య: 9

పోస్టుల వివరాలు: మెకానిక్ – 5, ఎలక్ట్రీషియన్ – 2, టైర్మాన్ – 1, కమ్మరి – 1.

వయోపరిమితి: 01.07.2022 నాటికి 18 నుండి 30 సంవత్సరాలు కలిగి ఉండాలి.

పే స్కేల్‌: 19,900

అర్హతలు: ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సాంకేతిక సంస్థ నుండి ట్రేడ్‌లో సర్టిఫికేట్ లేదా సంబంధిత ట్రేడ్‌లో ఒక సంవత్సరం అనుభవంతో 8వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. మోటార్ వెహికల్ పోస్టుకి అప్లై చేసుకునే వారు హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెస్ తప్పకుండా కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ ద్వారా అవసరమైన అర్హతలు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తారు.

చివరి తేదీ: 9 మే 2022 సాయంత్రం 5 గంటల వరకు.

అడ్రస్‌:  సీనియర్ మానేజర్,మెయిల్ మోటర్ సర్వీస్, 134-A , వర్లి, ముంబాయి 400018 కు దరఖాస్తును పంపాలి.