రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ కి ఒక్క మెసేజ్ – 70 వేలు కొట్టేశారు- కస్టమర్లు జర జాగ్రత్త

రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ కి ఒక్క మెసేజ్ - 70 వేలు కొట్టేశారు- కస్టమర్లు జర జాగ్రత్త

0
86

ఈ రోజుల్లో సైబర్ మోసాలు రోజు పదుల సంఖ్యలో జరుగుతున్నాయి, ఎన్నిసార్లు పోలీసులు బ్యాంకు సిబ్బంది చెబుతున్నా ఇలా మోసగాళ్ల చేతిలో బలి అయిపోతున్న కస్టమర్లు చాలా మంది ఉన్నారు, తాజాగా ఓ బ్యాంకు రిటైర్డ్ మేనేజర్ ని మోసం చేశారు ఈకేటుగాళ్లు.

మీ ఖాతాలోంచి రూ.25వేలు డ్రా అయ్యాయి.. డ్రా చేసింది మీరు కాకుంటే.. వెంటనే కస్టమర్ కేర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి.. ఇదీ ఓ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్కు వచ్చిన మేసేజ్.ఇక ఆ మేనేజర్ కంగారులో వారికి ఫోన్ చేశాడు, తన స్టేట్ మెంట్ చూసుకోలేదు, వెంటనే వారికి కాల్ చేసి తన కార్డ్ వివరాలు చెప్పాడు.

ఈ సమయంలో వచ్చిన ఓటీపీ కూడా చెప్పాలి అని మోసగాళ్లు అడిగారు ఆ ఓటీపీ కూడా చెప్పాడు
అంతే వెంటనే నిమిషంలో అకౌంట్ నుంచి రూ.70వేలు మాయం అయ్యాయి. ఆ తర్వాత తాను మోసపోయానని తెలిసి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు,

అసలు ఈ మేనేజర్ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన వివరాలు చెప్పాలి, అంతేకాని ఇలా కార్డ్ వివరాలు కంగారులో చెప్పేశాడు చివరకు వారు ఈజీగా నగదు కొట్టేశారు, మరోసారి ఈ ఘటనతో పోలీసులు అందరికి ఇదే చెబుతున్నారు.. ఎవరికి ఓటీపీ అకౌంట్ల వివరాలు ఇవ్వద్దు అంటున్నారు.