గోదావరికి పెరుగుతున్న వరద..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

0
112

ఇప్పటికే కురిసిన వర్షాలకు తెలంగాణలోని ప్రాజెక్టులు, చెరువులు, నదులు నిండు కుండను తలపిస్తున్నాయి. ఇక తాజాగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. నిన్న 35 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం ఈరోజు మధ్యాహ్నానికి 41. 2 అడుగులు దాటింది. దీనితో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

భద్రాచలం వద్ద గోదావరిలోకి ఎగువ నుంచి 8,56,949 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది అధికారులు తెలిపారు. గోదావరి నీటిమట్టం పెరగడంతో… స్నానఘట్టాల వద్దకు నీరు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలంలో ఇంకా నీటిమట్టం పెరుగుతుంది. ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.