డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఎస్బిఐ గుడ్ న్యూస్..

0
104

భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ‘ఎస్‌బీఐ యూత్‌ ఫర్‌ ఇండియా ఫెలోషిప్‌’ ప్రోగ్రామ్‌ని నిర్వహించింది.  దీనిలో భాగంగానే ఈ ఏడాదికి సంబంధించి ఎస్‌బీఐ యూత్‌ ఫర్‌ ఇండియా ఫెలోషిప్‌-2022 కి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌, పర్సనాలిటీ అసెస్‌మెంట్‌, ఇంటర్వ్యూలు ఇలా మూడు దశలు ఆధారంగా ఎంపిక చేస్తారు. విద్యార్హతలు ప్రొఫెషనల్ బ్యాక్‌గ్రౌండ్ చెప్పిన తర్వాత ఆన్‌లైన్ అసెస్‌మెంట్ స్టేజ్ ఉంటుంది. ఆ తర్వాత పర్సనాలిటీ అసెస్‌మెంట్, ఇంటర్వ్యూ ఉంటుంది. వృత్తి, వ్యక్తిగత అంశాలు  వంటివి చూసి ఎంపిక చేయడం జరుగుతుంది.

దీని కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్‌ 30, 2022. నివాస ఖర్చుల కోసం నెలకు రూ.15,000, రవాణా ఖర్చుల కోసం నెలకు రూ.1,000, అలవెన్సుల కింద రూ.50,000 ఉంటుంది. అలానే మెడికల్‌ ఇన్సూరెన్స్‌ కూడా ఉంటుంది.