తెలంగాణలో ప్రియాంకరెడ్డి హత్య ఘటనతో స్టేట్ ఉలిక్కిపడింది.. ఈ సమయంలో మరో దారుణం ,24 గంటలు గడువక ముందే అక్కడ నుంచి కూత వేటు దూరంలో జరిగింది.. అది కూడా సేమ్ ప్రియాంకరెడ్డి హ్యత లాగానే జరిగింది… శంషాబాద్లో మరో దారుణం చోటుచేసుకుంది. శంషాబాద్ రూరల్ పీఎస్ పరిధిలోని సిద్ధులగుట్ట రోడ్డులో కొంతమంది గుర్తు తెలియని దుండగులు మహిళను హత్య చేసి, బంగారు మైసమ్మ ఆలయం దగ్గర మృతదేహాన్ని తగులబెట్టారు.
ఓపక్క సీపీ మీడియా సమావేశం జరుగుతున్న సమయంలో ఈ దారుణం జరిగింది.. పక్కన జనం నిత్యం తిరుగుతూ ఉంటారు.. దగ్గర్లో సినిమా షూటింగ్ కూడా జరిగింది, అయితే ఇంత దారుణంగా ఎవరు ఈ దారుణం చేశారు అనేది పోలీసులు విచారణ చేస్తున్నారు.
అటువైపు వెళుతున్న వ్యక్తి అక్కడ కాలిన శవం చూసి అందరికి చెప్పి. పోలీసులకు కబురు అందించాడు. వెంటనే చేరుకున్న పోలీసులు అక్కడ సాక్ష్యాదారాలు సేకరించారు, అయితే రెండు రోజుల్లో రెండు ఘటనలు ఒకే చోట జరగడంతో పాషా గ్యాంగ్ లాంటివి ఇంకా ఏమైనా ఉన్నాయా అని విచారణ చేస్తున్నారు పోలీసులు.