సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతో డవలప్ అవుతుంది కాని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వింత ఆచారాలు మూడ నమ్మకాలు వదలడం లేదు, ఇంతలా అభివృద్ది పదంలో ముందుకు సాగుతున్నా వీరి ఆలోచన మాత్రం ఇంకా ఆ మూడనమ్మకాల చుట్టూ తిరుగుతోంది, ఇక వివాహాల విషయంలో ఇలాంటివి మరిన్ని చేస్తున్నారు.
కొన్ని తెగల్లోనూ, గిరిజనుల్లోనూ కొన్ని వింత వింత ఆచారాలు ఇంకా పాటిస్తూనే ఉన్నారు.
మహారాష్ట్రలోని కంచర్భట్ తెగకు చెందిన వారిలోనూ ఇలాంటి వివాదాస్పద ఆచారమే ఒకటి ఉంది. ఇది ఇప్పుడు రెండు కాపురాల్లో నిప్పు రాజేసింది. చివరకు పోలీస్ స్టేషన్ కు చేరింది ఈ పంచాయతీ.
మహారాష్ట్రిలోని కొల్లాపూర్ కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లకు గతేడాది నవంబర్ 27న అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు అన్నాదమ్ముళ్లతో పెళ్లి జరిగింది. వీరు కంచర్భట్ తెగకు చెందిన వారు ..వీరి ఆచారం ప్రకారం శోభనం గదిలో ఈ అమ్మాయిలకి కన్యత్వ పరీక్షలు చేస్తారు.. మంచంపై తెల్లటి దుప్పటి పరిచి ఉంచుతారు, ఉదయం దానిపై రక్తం ఉంటే ఆమె కన్య అని నమ్ముతారు.
లేదంటే నమ్మరు. ఇక ఇద్దరు అక్కా చెల్లెల్లకు ఈ పరీక్ష చేస్తే ఒకరికి ఇలా కనిపించింది ఒకరికి ఇలా రాకపోవడంతో వారిలో అనుమానం వచ్చింది.. వధువు తల్లిదండ్రులను పది లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో పెద్దల మధ్య ఇది పెట్టి ఇద్దరికి విడాకులు ఇస్తాము అని బెదిరించారు అబ్బాయిలు… దీంతో ఆ అమ్మాయిలు పోలీసులని ఆశ్రయించారు.. వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు, ఇదెక్కడి ఆచారం అంటున్నారు అందరూ.