బైక్ రైడర్స్ కు షాక్..

0
89

ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు బ్లాక్ ఫిల్మ్స్ తొలగించే పనిలో నిమగ్నమై సామాన్యుల నుండి సెలెబ్రెటీల వరకు ఎవ్వరిని వదిలిపెట్టకుండా అందరికి ఫైన్ విధిస్తున్నారు. తాజాగా దేశంలో శబ్ద కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు శబ్దకాలుష్యం నివారణపై కూడా కఠిన చర్యలు తీసుకోబోతున్నారు.

అధిక శబ్దం తో శబ్ద కాలుష్యం చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ద్విచక్ర వాహన దారులకు ఇక ఇప్పడి నుండి చెక్ పెట్టనున్నారు. శబ్ద కాలుష్యన్నీ అరికట్టడానికి ట్రాఫిక్ పోలీసులు లేటెస్ట్ టెక్నాలజీ కెమెరాలను అమలు చేయబోతున్నారు. దీనివల్ల శబ్దకాలుష్యం చేసే వాహనదారులకు ఎక్కడున్న పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది.

ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ సిపి రంగనాథ్ అసెంబ్లీ సిగ్నల్ వద్ద ట్రయల్ రన్ నిర్వహించారు. అనంతరం జర్మన్ ఆధారిత అకోమ్ గ్రూప్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం అయ్యి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ లో అధిక శబ్దం చేసే వాహనదారులను కంట్రోల్ చేయాలనీ నిర్ణయించుకున్నారు.

అంతేకాకుండా హైదరాబాద్ లోని అధిక జనం ఉన్న ప్రదేశాలలో వాహనదారులకు ఇబ్బందికరంగా సౌండ్ చేసే వాహనాలను కూడా నియంత్రిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ నూతన టెక్నాలజీతో ఉన్న కెమెరాల ద్వారా శబ్దకాలుష్యాన్ని అదుపు చేయబోతున్నామని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రజలకు శబ్దపరంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని తెలిపారు.