సమ్మర్ లో వేడి నుండి తట్టుకోవాలంటే ఇలా చేయండి..

0
45

ఎండలు ముదరడంతో ప్రజలు వేడి నుండి తట్టుకోలేక పోతున్నారు. ఉదయం 11దాటితే చాలు అడుగు బయట పెట్టే సాహసం ఎవ్వరు చేయలేకపోతున్నారు. అందుకే ఈ ఎండల నుండి ఉపశమనం పొందాలంటే ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి..ఆరోగ్యంగా జీవించండి. వేసవిలో ఏసీ లో ఉన్న ఫీలింగ్ పొందాలంటే  ఇలా చేసి చూడండి.

వేసవిలో అధిక నీరు తాగడం వల్ల కేవలం ఆరోగ్యపరమైన లాభాలే కాకుండా..శరీరాన్ని కూడా చల్లగా ఉంచుకోవచ్చు. అంతేకాకుండా డిప్రెషన్వే సమస్య కూడా వేధించాదు. వేసవి కాలంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మెటబాలిజం మెరుగుపడుతుంది. వేసవిలో తేలికపాటి దుస్తులు వేసుకోవడం వల్ల వేడి నుండి తట్టుకోవచ్చు.

అంతేకాకుండా వేసవిలో పుచ్చకాయ, కొబ్బరినీళ్లు, తాటి ముంజలు వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరం చల్లబడానికి ఆస్కారం ఉంటుంది. వేసవిలో చాలామందికి చెమట అధికంగా వస్తుంది. కానీ అలా రాకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే శరీరానికి ఎలాంటి హాని కలగదు. ఇంట్లో వెలుతురు లేకుండా చేయడం వల్ల రూమ్ టెంపరేచర్ చల్లగా ఉంటుంది.