ఆర్టీసీ ప్రయాణికులకు షాక్..

0
123

ప్రస్తుతం డీజిల్ ధరలు పెరగడంతో ప్రతి ఒక్కరిపై అదనపు భారం పడనుంది. దాంతో టి.ఎస్ . ఆర్టీసీ డీజిల్ సెన్ విధింపుపై ప్రత్యామ్నాయ లేక రాసారు. అంతేకాకుండా దీనికి ప్రజలు కూడా సహకరించాలని టి.ఎస్ . ఆర్టీసీ ఛైర్మన్ శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ , ఎం.ఎల్.ఎ , వి.సి అండ్ ఎం.డి శ్రీ వి.సి. సజ్జనార్ , ఐ.పి.ఎస్ కోరుకున్నారు. పెరుగుతున్న డీజిల్ ధరలు టి.ఎన్ .ఆర్టీసీకి గుదిబండగా మారాయి. అంతర్గత సామర్థ్యం మెరుగవుతున్నప్పటికీ రోజు వారీ ఖర్చులు పెరిగిపోతుండటంతో సంస్థ నష్టాల్ని చవిచూడాల్సివస్తోంది . ఆరోహణ క్రమంలో పెరిగిపోతున్న డీజిల్ ధరల వల్ల టి.ఎన్ .ఆర్టీ ఆర్థిక భారాన్ని మోస్తోంది .

ప్రయాణీకులను గమ్యస్థానాలను చేర్చడానికి నడుపుతున్న బస్సుల వినియోగానికి ప్రతి రోజు 6 లక్షల లీలర్ల హెచ్.ఎస్.డి అయిల్ను వినియోగిస్తోంది . ఇటీవల కాలంలో చమురు ధరలు అమాంతంగా అసాధరణ రీతిలో పెరిగిపోయాయి. 2021 డిసెంబరులో రూ . 85 ఉన్న హెచ్.ఎస్.డి ఆయిల్ ధర భారీ వినియోగదారులకు ప్రస్తుతం రూ.118 కి ఎగబాకింది అంటే ఈ వ్యవధిలో రూ.35 పెరిగిపోయింది . ఇంతకాలం ఏదో రకంగా డీజిల్ భారాన్ని మోస్తూ వచ్చింది . అయితే , క్రమంగా పెరిగిపోతున్న ఈ చమురు ధరలు ఒకింత సంస్థ ఆర్థిక వ్యవహారాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి . ఈ కారణంగా ప్రయాణీకుల చార్జీలపై డీజిల్ సెన్ విధించడం సంస్థకు అనివార్యమైంది .

ఈ నిర్ణయం సంస్థకు కొంత ఉపసమనం కల్గించడంతో పాటు ప్రయాణీకులకు మరింత మెరుగైన ప్రజా రవాణా సేవల్ని కొనసాగించడానికి దోహద పడగలదని యాజమాన్యం భావిస్తోంది . గత సంవత్సరాలలో కష్ట సమాయాల్లో ఉన్న సంస్థను ఆదరించిన ప్రయాణీకులు అదే మాదిరిగానే ఈ నిర్ణయానికి కూడా సానుకూలత వ్యక్తం చేయాలని యాజమాన్యం కోరుతోంది. ఎంతో కాలంగా చౌకగా , సురక్షితంగా ప్రజా రవాణా సేవల్ని అందిస్తున్న టి.ఎన్ . ఆర్టీసీ అనివార్య పరిస్థితుల్లో తీసుకున్న డీజిల్ సెన్ నిర్ణయాన్ని ప్రజలు అర్థం చేసుకోని యాధావిధిగా సహకరించాలని సంస్థ గౌరవ చైర్మన్ శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ , ఎం.ఎల్.ఎ గారు , వైన్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వి.సి.సజ్జనార్ , ఐ.పి.ఎస్ గారు కోరుతున్నారు .

పల్లెవెలుగు , సిటీ ఆర్డినరీ సర్వీసులలో ఒక్కో ప్రయాణీకుని నుంచి డీజిల్ సెస్ కింద రూ .2 , ఎక్స్ ప్రెస్ , డీలక్స్ , సూపర్ లగ్జరీ , సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ , మెట్రో డీలక్స్ , ఏసీ సర్వీసులలో ఒక్కో ప్రయాణీకుని నుంచి రూ .5 వసూలు చేయాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఈ విధానం ఈ నెల 9 నుంచి అమలులోకి వస్తుందన్నారు . సామాన్యులు , తక్కువ దూరం ప్రయాంణించే ప్రయాణీకులపై భారం పడకుండా డీజిల్ సెన్ విధానాన్ని అములులోకి తీసుకొస్తున్నట్లు చెబుతూ వల్లె వెలుగు , సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో కనీస చార్జీ రూ . 10 కొనసాగుతుందని స్పష్టం చేశారు . ప్రజా రవాణా సేవల్ని అందిస్తున్న టి.ఎస్ . ఆర్టీసీని ఎప్పటి మాదిరిగానే ఆదరించాలని వారు కోరారు .