ఈ ఇంటిలో పాములు ఎక్కడ ఉన్నాయో చూస్తే షాక్

Shock to see where the snakes are in this house

0
120

 

పాముని చూశాం అంటే మనం ఆమడ దూరం పారిపోతాం, అది మన వైపు వస్తోంది అంటే ఆ దరిదాపుల్లో కూడా ఉండం, కాని చల్లటి ప్రాంతం ఏదైనా ఉన్నా చెత్తా చెదారం ఉన్నా అక్కడ పాములు నివాసం పెట్టుకుంటాయి, చెట్ల పొదలు చెత్త వేసిన ప్రాంతాల్లో అవి నివాసం ఉంటాయి.. అయితే ఇంటిలో కూడా ఒక్కోసారి పాములు తిష్టవేయడం చూసే ఉంటాం.

ఇక్కడ ఇదే జరిగింది ఏకంగా ఇంటి సీలింగ్ లోనే పాములు తిష్టవేశాయి. ఏకంగా నాలుగు పాములు వారికి కనిపించాయి మొత్తం సీలింగ్ తీస్తే ఇంకా పదుల సంఖ్యలో పాములు ఉండవచ్చు అంటున్నారు అందులో ఉన్న వారు.. మరి ఈ ఘటన ఎక్కడ జరిగింది అంటే? జార్జియాకు చెందిన హ్యారీ పుగ్లీజ్, అతడి కుటుంబం ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.

ఇంటి పైకప్పు లీక్ కావడం వల్ల సీలింగ్ విరిగిపోయింది. రెండు రోజుల తర్వాత సీలింగ్ రంథ్రం నుంచి పాములు వేలాడుతూ కనిపించాయి. ఓనర్ కు చెప్పినా అతను పట్టించుకోవడం లేదట. పాపం ఆ కుటుంబ మరోదారి లేక ఆ పాములతోనే సావాసం చేస్తున్నారు. ఫిబ్రవరి నెలలో చెబితే ఇప్పటివరకు రిపేర్ చేయించలేదు. ఇది చూసిన వారు అందరూ ముందు ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోండి అని సలహా ఇస్తున్నారు.

ఇక్కడ లింక్ లో ఆ సీలింగ్ చూడవచ్చు.

https://twitter.com/BlissZechman/status/1397262257139200