సామాన్యులకు షాక్..దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక నిర్ణయం

0
94

సామాన్యులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ షాక్ ఇచ్చింది. సంక్రాంతి పండుగ వేళ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఫ్లాట్‌ఫాం టికెట్‌ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్‌లో ఫ్లాట్‌ఫాం టికెట్‌ ధర ₹10 నుంచి ₹50కి పెంచుతున్నట్లు వెల్లడించింది.

హైదరాబాద్(నాంపల్లి), కాచిగూడ, వరంగల్, ఖమ్మం, లింగంపల్లి, కాజీపేట్, మహబూబాబాద్, రామగుండం, మంచిర్యాల, భధ్రాచలంరోడ్, వికారాబాద్, తాండూర్, బీదర్, పర్లివైజ్ఞాత్, బేగంపేట్ రైల్వే స్టేషన్లలో ఫ్లాంట్ ఫాం టికెట్ ధరలను రూ.10 నుంచి రూ.20 వరకు పెంచామన్నారు.

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వే శాఖ తెలిపింది.. పెంచిన ఫ్లాట్‌ఫాం టికెట్‌ ధరలు తక్షణమే అమల్లోకి వచ్చి, ఈనెల 20 వరకు కొనసాగుతాయని వెల్లడించింది. రైల్వే స్టేషన్స్‌లో ప్రయాణీకులతో పాటు అనవసరంగా జనం గుంపు కడుతున్నారనీ, జనాల రద్ధీని తగ్గించేందుకు ప్లాట్‌ఫారం టికెట్ల ధరలు అమాంతం పెంచుతున్నట్టు వెల్లడించింది రైల్వే శాఖ.