మరికాసేపట్లో సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్‌ రాత పరీక్ష..నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

0
99
AP Inter exams Schedule

ఇటీవలే సింగరేణి కాలరీస్‌లో 177 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి మరికాసేపట్లో రాత పరీక్ష జరుగనుంది. నేడు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఈ పోస్టులకు 98,882 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా..వీరికోసం ఎనిమిది జిల్లాల్లో 187 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. వారం రోజుల్లో ప్రాథమిక ‘కీ’ని విడుదల చేస్తామని వెల్లడించారు.