మనం ఈ లాక్ డౌన్ వేళ సుమారు రెండు మూడు నెలలు ఉండటానికి ఎంతో ఇబ్బంది పడుతున్నాం.. బయటకు రావాలి అని తెగ హైరానా పడుతున్నాం.. కాని ఈమె ఏకంగా ఆరు సంవత్సరాల పాటు బయటకు రాకుండా ఇంట్లోనే ఉంది.. అంటే ఆమెకు ఇళ్లు మాత్రమే ప్రపంచం. బయట ఎలా ఉంది అనే విషయం కూడా ఆమెకి తెలియదు.
కరోనా వైరస్ రాక ముందు నుంచే ఆమె లాక్డౌన్ పాటించింది. మరి ఎందుకు ఆమెకు ఈ పరిస్దితి అంటే
ఆమెకి ఎమెటోఫోబియా అంటే వాంతుల భయం. ఈ వాంతుల భయం వల్ల ఆమె ఇంటిలోనే ఉండిపోయింది.
తనకి వాంతులు చేసుకోవడమంటే భయం. అంతేకాదు.. ఎవరైనా వాంతులు చేసుకుంటున్నారని తెలిసినా, వాంతులు చేసుకొనేవారిని చూసినా ఆమెకు వికారం వస్తుంది. ఇక ఆమెకి కూడా పెద్ద పెద్ద వాంతులు అవుతాయి.. 35 ఏళ్ల ఎమ్మా డావిస్కు ఇది తీవ్రస్థాయిలో ఉంది. ఇక ఆమె భర్త వారి పిల్లలను బయటకు తీసుకువెళ్లి ఏం కావాలి అన్నా తీసుకువస్తారు… ఆమె మాత్రం అసలు కాలు బయటపెట్టదు..12 ఏళ్ల నుంచి ఎమ్మాలో ఈ ఫొబియా బాగా పెరిగింది. రోజూ ఇలా వాంతులు చేసుకుంటూనే ఉంటుంది.