బిగ్‌బాస్ హోస్ట్‌గా స్టార్ హీరోయిన్..షాక్ లో అక్కినేని ఫ్యాన్స్?

0
113

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ హౌస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఈ షో ప్రారంభమై ఇప్పటికే  సీజన్ సిక్స్ కూడా ముగించుకొని విశేషాప్రేక్షాదరణ సొంతం చేసుకుంది. అయితే ఈ షో ద్వారా ప్రేక్షకులకు అందులో ఉండే కంటెస్టెంట్స్ తమ నిజజీవితాలలో ఎలానడుచుకుంటారో తెలియజేయడం కోసం ప్రారంభించారు.

తాజాగా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ విన్నర్ గా బిందు మాధవి గెలిచిన సంగతి అందరికీ తెలసిందే. ఈ సీజన్ లో చివరగా అఖిల్, బిందు మాధవి ఉండగా ప్రేక్షకుల అధిక మెజారిటీ ఓట్లతో విజయాన్ని తనసొంతం చేసుకుంది ఆడపులి. ఈ క్రమంలోనే తర్వాత సీజన్ కు సంబంధించిన సామాన్యులు కూడా ‘బిగ్ బాస్’లో పార్టిసిపేట్ చేయొచ్చని నాగార్జున ప్రకటించి ఖుషి చేశారు.

తాజాగా ‘బిగ్ బాస్ ’ నిర్వాహకులు అక్కినేని నాగార్జునకు, అతని అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చినట్లు సమాచారం తెలుస్తుంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవరించి మనందరినీ ఆకట్టుకున్న నాగార్జున స్థానంలో సమంతను హోస్ట్ గా పెట్టాలని ఆలోచిస్తున్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంకా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి ఇందులో వాస్తవమెంతో తెలియాల్సి ఉంది.