స్టేట్ బ్యాంక్ అదిరిపోయే స్కీమ్.. దీంతో కస్టమర్లకు ప్రతి నెలా ఆదాయం

0
101

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజల కోసం ఎన్నో వినూత్నమైన స్కీమ్ లను తీసుకొస్తుంది. ఇప్పటికే ఎన్నో స్కీమ్ లను మనకు పరిచయం చేసింది. ప్రస్తుతం యాన్యుటీ డిపాజిట్ అనే కొత్త స్కీమ్ తో ప్రజలను ఆనదింప చేయడానికి మనముందుకొస్తుంది.

ఈ స్కీమ్‌లో డబ్బులు దాచుకోవడం ద్వారా ప్రతీ నెలా రూ.10,000 వరకు ఆదాయం వస్తుంది. ప్రతీ నెలా కూడా కచ్చితంగా ఇన్కమ్ వస్తుంది. ఎక్కువ డబ్బులు వున్నప్పుడు ఇందులో డబ్బులు పెడితే మంచిది. మైనర్లు, మేజర్లు ఎవరైనా దీనిలో చేరచ్చు.

జాయింట్ అకౌంట్ అయినా సరే ఓపెన్ చెయ్యచ్చు. ఇందులో కనీసం రూ.25,000 పొదుపు చేయాలి. గరిష్ట పరిమితి ఏమి లేదు. కనీసం రూ.1,000 నుంచి ప్రతీ నెలా ఆదాయం లభిస్తుంది. మీరు నేరుగా స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్లి ఈ స్కీమ్ లో చేరచ్చు. ఒకవేళ అకౌంట్ హోల్డర్ మరణిస్తే డబ్బులు నామినీకి వస్తాయి.