బ్రతకాలని ఉన్నా వాడు బ్రతకనివ్వడంలేదు… కన్నీరు తెప్పిస్తున్న యువతి సూసైడ్ నోట్

బ్రతకాలని ఉన్నా వాడు బ్రతకనివ్వడంలేదు... కన్నీరు తెప్పిస్తున్న యువతి సూసైడ్ నోట్

0
87

మహిళలకు రాను రాను రక్షణ కరువైంది…. ప్రతీ రోజు దేశంలో ఎక్కడో ఒక చోట కామాంధులకు యువతులు బలిఅవుతున్నారు… తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది… ఓ యువకుడు తనను వేధిస్తున్నాడనే ఉద్దేశంతో యువతి సూసైడ్ చేసుకుంది….

వేరే దారిలేక తాను ఆత్మ హత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ లో తెలిపింది… తాను ఎలాంటి తప్పు చేయలేదని చేయని తప్పుకు బలైపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది… తనకు బతకాలని ఉన్నా వాడు బతకనివ్వడంలేదని సూసైడ్ లో తన తల్లికి తెలిపింది…వాడి రూమ్ కు వెళ్లక పోతే తన ఫోటోలను బయట పెడతానని బెదిరిస్తున్నాడు ఈ విషయం నీకు చెబితే ఎక్కడ బాదపడతావోనని చెప్పలేదు…

నీకళ్లల్లోకి కళ్లు పెట్టి చెప్పాలంటే భయం వేసిందని పేర్కొంది అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపింది… తనకు ఒక సహాయం చేయాలని తనను వేధించిన ఆ యువకుడిని వదిలేయండి లేదంటే వాడు ఎప్పటికైనా ఫోటోలు బయట పెడతాడు అలా చేస్తే నా ఆత్మకు శాంతి కలుగదని ఇదే నా చివరి కోరిక అని తెలిపింది… అయితే ఆ వ్యక్తి పేరు మాత్రం రాయలేదు… దీంతో మరిన్ని అనుమానాలకు దారి తీస్తోంది…