తాళి కట్టిన 10 నిమిషాలకే వరుడు పరార్… రీజన్ తెలిస్తే షాక్ అవుతారు…

తాళి కట్టిన 10 నిమిషాలకే వరుడు పరార్... రీజన్ తెలిస్తే షాక్ అవుతారు...

0
94

పెద్దలు సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా వధువు వరుడు ఒక్కటయ్యారు… ఆతర్వాత పట్టుమని పదినిమిషాలు గడువకముందే పెళ్లికుమారుడు పరారయ్యాడు.. ఈ సంఘటన కదిరిలో జరిగింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… తలుపుల మండలం ఓబులరెడ్డిపల్లెకు చెందిన చిన్న అనే యువకుడికి కదిరి పట్టణంకు చెందిన తన అక్క కూతురితో వివాహం కుదిరింది…

ఇటీవలే వారికి పెద్దల సమక్షంలో వివాహం అయింది… ఆతర్వాత చిన్నా పత్తాలేకుండా పోయాడు… పెళ్లి సంబందం మాట్లాడుకునే విషయంలో వధువు తరుపు వారు వరుడికిమూడు తులాలు బంగారం ఇస్తామని ఒప్పుకున్నారు… అయితే వారు ఇవ్వలేదు… ఆర్థిక సమస్యల కారణంగా వారు ఇవ్వలేక పోయారు ఇక ఈ విషయం తెలుసుకున్న వరుడు తాళికట్టిన పదినిమిషాలకే అక్కడనుంచి వెళ్లిపోయాడు…

ఆతర్వాతన వందకు కాల్ చేసి తనకు బలవంతంగా పెళ్లి చేశారని ఫిర్యాదు చేశారు.. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కుటుంబ సభ్యులను పిలిపించి పరిస్థితిని సర్థుమనిగించేలా చేశారు…